<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము
   యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము

[V1]
 ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం
 క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము
 ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం
 దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం

[V2]
 ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం
 దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం

[V3]
 ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం
 ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం

[V4]
 ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం
 ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం</lyrics>
<title>ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము</title>
<hymn_number>82</hymn_number>
</song>